BCCI : ఇటీవల భారత క్రికెటర్లు తరచూ గాయాల బారిన పడడం.. సిరీస్ మధ్యలోనే స్క్వాడ్ నుంచి వైదొలగడం చూస్తున్నాం. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లు చివరకు శ్రీలంక పర్యటన మొత్తానికి దూరమవ్వడం పట్ల బీసీసీఐ(BCCI) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఏం జరుగుతోంది? ఆటగాళ్లు ఎందుకు త్వరగా కోలుకోవడం లేదు? అనే అంశంపై అత్యవసర సమీక్షకు సిద్ధమవుతోంది బీసీసీఐ.
విదేశీ పర్యటనల్లో భారత ఆటగాళ్లు ఈమధ్య తరచూ గాయపడుతున్నారు. ఫలితంగా.. కొత్త కాంబినేషన్లు ప్రయత్నించడం, అవి బెడిసికొట్టి జట్టు విజయావకాశాల్ని దెబ్బతీయడం మామూలైపోయింది. పునరావాసంలో ఉండి.. ఫిట్‌గా తిరిగి వస్తారనుకుంటే.. బరువెక్కి కొందరు, గాయాలు నయమవ్వక కొందరు కీలక సిరీస్‌లకు దూరమవుతున్నారు.
The injuries pile up 🤕 pic.twitter.com/UU1Pji2HBL
— Cricinfo (@cricinfo) August 8, 2026
శ్రీలంక పర్యటనకు బుమ్రాతో పాటు సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యవసర సమీక్ష చేయనుంది. దాంతో, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హుటా హుటిన శనివారమే బెంగళూరుకు బయల్దేరాడు. అక్కడ సీఓఈ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఆదివారం అతడు రిహాబిలిటేషన్ తీరుతెన్నులు పరిశీలించి.. అసలేం జరుగుతుందో తెలుసుకోనున్నాడు.
జాతీయ సీనయర్ జట్టుతో పాటు జూనియర్ స్థాయిలో ఆడే క్రికెటర్లు ఎవరైనా గాయపడితే.. వారిని బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపుతుంది బీసీసీఐ. అక్కడ వైద్యబృందం, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో వీరు మెరుగవుతారు. అయితే.. ఇటీవల కాలంలో పరిస్థితి మాత్రం ఆందోలన కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆరుగురికి పైగా సీనియర్ ఆటగాళ్లు సీఈఓలో కోలుకుంటున్నారు.
BCCI top official rushes to Bengaluru for urgent review after injuries deal hard blow to Indian cricket team#BCCIhttps://t.co/Gv0xfRGpON pic.twitter.com/N5KJv9VSYA
— NDTV Sports (@Sports_NDTV) August 8, 2026
హార్దిక్ పాండ్యా(క్వాడ్రిసెప్స్ గాయం), బుమ్రా(మోకాలి వాపు), సాయి సుదర్శన్(కుడి బొటన వేలికి గాయం), హర్షిత్ రాణా( తొడకండరాల గాయం), నితీశ్ రెడ్డి(తొడ కండరాల గాయం), వాషింగ్టన్ సుందర్(క్వాడ్రిసెప్స్ గాయం), రంజీ ట్రోఫీ సమయంలో ఆకాశ్ దీప్(వెన్ను కింది భాగంలో ఎముకలు విరగడం).. ఇలా గాయాల చిట్టా పెద్దదే. అందుకని.. సీఓఈలో ఆటగాళ్లపై ఎలాంటి శ్రద్ద పెడుతున్నారు? ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? అనే విషయాల గురించి లక్ష్మణ్‌తో ఆగస్టు 9, ఆదివారం బీసీసీఐ సెక్రటరీ సైకియా సుదీర్ఘంగా చర్చించనున్నాడు.