1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘1996 ధర్మపురి’.గనన్ విహారి, అపర్ణదేవి జంటగా నటిస్తున్నారు. జగత్ దర్శకుడు. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మాత. ఈ నెల 22న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ధర్మపురి గడిలో పనిచేసే జీతగాడు, బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ఒరిజినల్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ఆనాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది’ అన్నారు. కథ మీద నమ్మకంతో థియేటర్స్‌లోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథనంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. హృద్యమైన ప్రేమకథగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని నాయకానాయికలు పేర్కొన్నారు.