Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Kavita Kumari: షూ లేకుండా, చీరలోనే 1600 మీటర్ల పరుగులో పాల్గొన్న కవితా కుమారి అందరికీ తెలిసిందే. అయితే ఆమె హై జంప్ పరీక్షలో విఫలమైంది. మూడు ప్రయత్నాల్లోనూ టెస్ట్‌ను క్లియర్ చేయలేకపోయింది. దీంతో ఆమె ఉద్యోగ కల నెరవేరలేదు.
రాంచీ: జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాకు చెందిన కవితా కుమారి(Kavita Kumari).. తన కాళ్లకు షూ లేకుండానే, చీరలోనే ఇటీవల హోంగార్డు రిక్రూట్మెంట్ పరీక్షలో భాగంగా నిర్వహించిన రన్నింగ్ పోటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. 1600 మీటర్ల రేస్‌ను ఆమె 8 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసింది. 10 నిమిషాల డెడ్‌లైన్ కన్నా ముందే తన లక్ష్యాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ కవితా కుమారి కల చెదిరింది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పోటీ పరీక్షల్లో పాల్గొన్నా.. హై జంప్‌ను ఆమె క్లియర్ చేయలేకపోయింది. మూడు ప్రయత్నాల్లోనూ ఆమె విఫలం కావడం వల్ల ఆమె ఉద్యోగ ఆశలు ఆడియాలసయ్యాయి.
రిక్రూట్మెంట్ పరీక్షలో కవిత నెంబర్ 238. 1600 మీటర్ల రేస్‌ను ఆమె డెడ్‌లైన్ లోపే విజయవంతంగా ఫినిష్ చేసింది. కానీ ఆమెకు హై జంప్‌లో క్లియర్ చేసేందుకు మూడు ఛాన్సులు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆ ఎత్తును ఆమె క్రాస్ చేయలేకపోయింది. ఈ పరీక్షలో 930 మంది మహిళా అభ్యర్థులు పోటీపడ్డారు. సిడో ఖాను జిల్లా గ్రౌండ్లో అంకిత్ రన్నింగ్ అకాడమీ నిర్వహించిన ట్రయల్ రన్లో కవిత తన పరుగుతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్థిక స్థోమత లేక ఆమె షూ కూడా కొనలేకపోయింది. కానీ వట్టి కాళ్లతో, చీరలో ఆమె పరుగు చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
కవిత జీవితం ఓ విషాద గాధలా మారింది. కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. ఇద్దరు పిల్లలను పోషించే బాధ్యత ఆమెదే. అయితే ఉద్యోగం సంపాదించి.. ఆర్థికంగా ఎదిగి.. కుటుంబాన్ని ఆదుకోవాలన్న పట్టుదల ఆమెలో ఉండేది. ఆమె పరుగు పందెం చూశాక చాలా మంది కవితకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 1600 మీటర్ల పరుగు పందాన్ని క్లియర్ చేయడం వల్ల ఆమె ఆశలు ఆకాశాన్నంటాయి. కానీ హై జంప్‌లో విఫలం కావడంతో ఆమె సెలెక్షన్‌కు దూరమైంది. ఉద్యోగం సాధించాలన్న కల నెరవేరలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

