బీవోబీ లాభం 1,783 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,783 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభంతో పోలిస్తే 48 శాతం క్షీణత కనబరిచింది.
న్యూఢిల్లీ, జూలై 24 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,783 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభంతో పోలిస్తే 48 శాతం క్షీణత కనబరిచింది. యూఏఈకి చెందిన ఎన్ఎంసీ గ్రూపుతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒకేసారి రూ.5,680 కోట్ల నిధులు చెల్లింపులు జరుపడంతో లాభాల్లో భారీగండి పడిందని బ్యాంక్ సీఈవో, ఎండీ దేబదత్త చంద్ తెలిపారు. సమీక్షకాలంలో బ్యాంక్‌నకు వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.31,091 కోట్ల నుంచి 6.8 శాతం వృద్ధితో రూ.33,211 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.28 శాతం నుంచి 1.99 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.60 శాతం నుంచి 0.50 శాతానికి దిగొచ్చాయి. గత త్రైమాసికంలో కొత్తగా రూ.3,422 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ 643 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.1,967 కోట్ల కంటే ఇది రెండింతలు తక్కువ. బ్యాంక్ గ్లోబల్ బిజినెస్ 15.4 శాతం వృద్ధితో రూ.30,50,457 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైర్-2 క్యాపిటల్ జారీ చేయనుండటంతో రూ.6 వేల కోట్ల వరకు నిధులు సేకరించాలని బ్యాంక్ సంకల్పించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

