హైదరాబాద్, అక్టోబర్ 22: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. వ్యవసాయ రుణాలకు పెద్దపీట వేస్తున్నది. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగోసారి ‘బరోడా కిసాన్ పక్వాడా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు రుణాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నట్లు బీవోబీ హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ మన్ మోహన్ గుప్తా తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో రూ.9,700 కోట్ల మేర వ్యవసాయ రుణాలు మంజూరు చేసినట్లు, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.700 కోట్ల మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే రుణాల్లో వృద్ధి 25 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.