ప్రస్తుత జనరేషన్ అంతా తొందరగా డబ్బులు సంపాదించే మార్గాలవైపే మొగ్గు చూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుకూలంగా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్నదే అందరి ఆలోచన. మరి డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. కొంతమంది వ్యాపారాలు చేస్తే మరికొందరు ఉద్యోగాలు చేసి సంపాదించాలనుకుంటారు. ఉద్యోగం చేయాలంటే దానికి సంబంధించిన చదువు అవసరం. కానీ వ్యాపారాల విషయానికొస్తే చదువుతో పనిలేదు. డబ్బులు సంపాదించేందుకు రకరకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి