
ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ భుజం నొప్పితో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరగా ఆయనకు సర్జరీ నిర్వహించారు. గత ఆరునెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణ ఇటీవల ‘ఆహా’ ఓటీటీ వేదికగా అన్‌స్టాపబుల్ అనే టాక్‌షో షూటింగ్లో పాల్గొంటున్నారు. మూడురోజుల క్రితం షూటింగ్ ముగించుకున్న బాలకృష్ణ కుడిభుజంలో తీవ్రమైన నొప్పి రాగా కేర్ ఆస్పత్రి వైద్యులు డా. రఘువీర్‌రెడ్డి, డా.బీఎన్. ప్రసాద్‌లను సంప్రదించారు. వైద్యులు బాలకృష్ణకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయగా కండరాల్లో చీలిక ఏర్పడిందని గుర్తించారు. దీంతో కేర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.