అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘లవ్ రెడ్డి’.ఎమ్జీఆర్ ఫిలింస్, గీతన్ ప్రొడక్షన్స్, శహరి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హేమలత రెడ్డి, మదన్ గోపాల్, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ను హీరో బాలకృష్ణ విడుదల చేశారు. అంతా కొత్త వాళ్లు కలిసి చేస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరారు