Jailer 2 | సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్’ 2023లో గుర్తుండే యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజనీ క్రేజ్‌కి మరోసారి నిదర్శనంగా నిలిచింది. మోహన్‌లాల్ , శివరాజ్‌కుమార్ ,జాకీ ష్రాఫ్ వంటి స్టార్ల గెస్ట్ అప్పియరెన్స్‌లు సినిమాకి అదనపు ఆకర్షణగా మారాయి. వసూళ్ల పరంగా కూడా “జైలర్” దుమ్మురేపి ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇంతటి భారీ విజయానంతరం, దర్శకుడు నెల్సన్ ఇప్పుడు ‘జైలర్ 2’ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. మొదటి భాగం కంటే మరింత యాక్షన్, ఎమోషన్, స్టార్ పవర్‌తో సీక్వెల్‌ని రూపొందించాలనే ఆలోచనతో ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ మూవీలో మొదటి భాగంలో కనిపించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ పాత్రలు కొనసాగుతుండగా, మరో స్టార్ హీరో ఈసారి స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ టాక్ ప్రకారం, ఆ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ ను అప్రోచ్ చేశారని తెలిసింది. ఏపీకి చెందిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా 20 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉన్న రోల్ కోసం బాలయ్యను ఎంపిక చేశారని, దానికి ఆయనకు ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, బాలయ్య ఇప్పుడు ‘జైలర్ 2’ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణం అధికారికంగా వెల్లడించకపోయినా, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే ప్రధాన కారణం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉండటంతో పాటు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కి సిద్ధమవుతున్నారు. అదనంగా క్రిష్ జాగర్లమూడి తో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ దశలో ఉందట. ఈ వరుస ప్రాజెక్ట్‌ల కారణంగా బాలయ్య షెడ్యూల్ పూర్తిగా ఫుల్ అయిపోవడంతో, ‘జైలర్ 2’కి సమయం కేటాయించలేకపోయారని టాక్. ఇక బాలయ్య ప్లేస్‌లో ఇప్పుడు మేకర్స్ ఫహాద్ ఫజిల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న యాక్టర్లలో ఫహాద్ ఒకరు. ఆయన గతంలో రజనీకాంత్‌తో ‘వెట్టయాన్’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ‘జైలర్ 2’లో ఫహాద్ పాత్ర రజనీని మరింత ఎలివేట్ చేసే కీలకమైన రోల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది.