Bala Krishna | నందమూరి నటసింహం బాలయ్య జూన్ 10న తన 65వ బర్త్ డే జరుపుకున్నారు. ఆయనకి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే కాక పలువురు రాజకీయనాయకులు కూడా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన అఖండ టీజర్ ప్రకంపనలు పుట్టిస్తుంది. కేవలం 24 గంటల్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పాటు, 5.90 లక్షలకు పైగా లైక్‌లను సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనతపై చిత్ర బృందంతో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
నందమూరి బాలకృష్ణ 1974లో వచ్చిన ‘‘తాతమ్మ కల’’ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. గత 50 ఏళ్లుగా అలుపన్నది లేకుండా శ్రమిస్తున్నారు. ఒకవైపు స్టార్ హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా బాలయ్య తన సత్తా చూపుతున్నారు. హిందూపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ కొట్టేశారు. ఇక ఆయన సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక బాలయ్యకి 65 ఏళ్లు వచ్చిన ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వయస్సులో కూడా ఆయన అంత యాక్టివ్‌గా ఉంటున్నాడు కాబట్టి బాలయ్య తీసుకునే డైట్ ఏమిటో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
అయితే బాలకృష్ణకు ఆహారం విషయంలో పెద్దగా ఎలాంటి నియమాలు పెట్టుకోరు. ఆయన తనకు నచ్చిన ఆహారం తినేస్తూ ఉంటారు. సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ కోసం అవసరం అయితే స్వల్పంగా డైట్ లో పలు మార్పులు చేసుకుంటారు.ఇక స్టార్ హీరో కాబట్టి ఇంటి నుండి స్పెషల్ భోజనం తెచ్చుకొని తినాలని బాలయ్యకి ఏమి ఉండదు. సెట్లో ఉన్నప్పుడు అందరూ తినే ప్రొడక్షన్ ఫుడ్ తీసుకుంటారు. సెట్లో అందరితో కలిసి ప్రొడక్షన్ ఫుడ్ తీసుకోవడమే తనకు ఇష్టమని బాలకృష్ణ చెబుతుంటారు. నటుడు, రాజకీయ నాయకుడిగా అదరగొడుతున్న బాలయ్య హోస్ట్‌గా కూడా సత్తా చాటారు. అన్‌స్టాపబుల్ అనే షోతో బాలయ్య ఎలాంటి రికార్డులు తిరగరాసారో మనం చూశాం.