అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫణి ప్రదీప్ దూళిపూడి దర్శకుడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మాతలు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా ఇటీవల సక్సెస్మీట్ని మేకర్స్ నిర్వహించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని, మౌత్టాక్తోనే అందరికీ రీచ్ అయ్యిందని చిత్రబృందం తెలిపారు. ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారన్నారు.