యువ నటుడు శ్రీనందు లీడ్‌రోల్ చేసిన అప్‌కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ్’. యామినీ భాస్కర్ కథానాయిక. వరుణ్‌రెడ్డి దర్శకుడు. శ్రీనందు, శ్యామ్ సుందర్‌రెడ్డి తుడి కలిసి నిర్మించారు. దగ్గుబాటి రానా సమర్పకుడు. జనవరి 1న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని మేకర్స్ నిర్వహించారు.
దర్శకుడు వరుణ్ ఈ సినిమాను విభిన్నంగా తెరకెక్కించారని, అందుకే ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నామని అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు తెలిపారు. ఈ సినిమాను సురేష్‌బాబు విడుదల చేస్తున్నందుకు హీరో శ్రీనందు ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని, వందశాతం ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని హీరో శ్రీనందుకు చెప్పారు. ఇంకా దర్శకుడు వరుణ్‌రెడ్డి, కథానాయిక యామిని భాస్కర్, సంగీత దర్శకుడు స్మరణ సాయి కూడా మాట్లాడారు.