‘ఓ ఐదేళ్ల క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని, కెరీర్‌నీ ఒక కుదుపు కుదిపేసింది. అయితే.. స్వతహాగా నేను రచయితని. అందుకే ప్రతికూల పరిస్థితులతో పోరాటం చేసి విజేతగా నిలిచాను’ అంటున్నది ‘బిగ్‌బాస్’ సీజన్ 9లో టాప్ 5 ఫైనలిస్ట్‌గా నిలిచిన సంజనా గర్లాని. ఇంకా ఆమె చెబుతూ ‘ ‘బిగ్‌బాస్’ అనుభవం నా జీవితంలో కొత్త ప్రయాణానికి బాట వేసింది.
ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తాను ’ అంటూ ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిష చెల్లెలుగా నటించిన ఆ నాటి రోజుల్ని సంజన గుర్తు చేసుకున్నది. ఈ సందర్భంగా ‘బుజ్జిగాడు’లోని పవర్ఫుల్ డైలాగ్‌ని చెబుతూ అందర్నీ ఆకట్టుకున్నది సంజన గర్లాని.