Baahubali The Epic | దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేకుండా వరుస సక్సెస్‌లు అందుకున్న ఈ దర్శకుడు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ‘బాహుబలి’ సిరీస్‌తో ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేశారు. ఈ దర్శకుడు సినిమా రిలీజ్ అంటే ఇండస్ట్రీ అంతా దృష్టి సారిస్తుంది. సాధారణంగా రాజమౌళి సినిమాల సమయానికి ఇతర హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను వాయిదా వేస్తారు. కానీ ఈసారి మాత్రం ఒక స్టార్ హీరో ధైర్యంగా రాజమౌళికి పోటీగా రంగంలోకి దిగుతున్నారు.
తెలుగు సినిమా గర్వకారణమైన ‘బాహుబలి’ని మరోసారి థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి రెండు పార్టులను కలిపి ‘బాహుబలి ఎపిక్’ పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ గ్రాండ్ రీ-రిలీజ్ అక్టోబర్ 31న జరగనుంది. అదే రోజున మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా ‘మాస్ జాతర’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రాజమౌళి మాస్టర్‌పీస్ రీ-రిలీజ్ ఉన్నప్పటికీ, రవితేజ తన సినిమా విడుదల తేదీని మార్చకుండా ముందుకు వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి, మాస్ జాతర పోటీ నేపథ్యంలో రెండు సినిమాల మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.తాజాగా ప్రభాస్, రానా, రాజమౌళి సరదా ముచ్చట్లకి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఇందులో రాజమౌళి ఇప్పటికీ తన మైండ్‌లో కొన్ని సీన్స్ అలాగే ఉండిపోయాయని చెప్పారు.
కట్టప్ప బాహుబలిని చంపడానికి కత్తి పట్టుకున్ సమయంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ తనకి ఇప్పటికీ గుర్తున్నాయి. భళ్లాలదేవుడి విగ్రహాన్ని పైకి లేపే సమయంలో చేతులు వణికాయని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ సభలో తల నరికే సన్నివేశం గురించి ముచ్చటించుకున్నారు. మూడో రోజు ప్రభాస్ తల నరుకుతాడని రానా అనగా, ఆ సీన్ ఎంతో బాగుందని రాజమౌళి అంటాడు. దానికి ప్రభాస్ మాట్లాడుకోవడానికి బాగుంది కాని అని ప్రభాస్ చెబుతాడు. బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడని కాదు కాని, అతన్ని చంపేందుకు కట్టప్ప సిద్ధపడడం నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందని రాజమౌళి అన్నారు. వారి సరదా ముచ్చట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాయి.