కథానాయికలు ఎంచుకునే పాత్రల్లో సహజత్వం కనిపించాలంటే అందుకు విస్తృతమైన పరిశోధన అవసరమని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. బాలీవుడ్ చిత్రం ‘డాక్టర్ జీ’లో ఈ భామ ఆయుష్మాన్ఖురానాతో కలిసి నటించింది. ఇందులో ఆమె డాక్టర్ ఫాతిమా పాత్రలో కనిపించనుంది. కెరీర్లో తొలిసారి వైద్యురాలి పాత్రను షోషిస్తుండటంతో ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె మాట్లాడుతూ ‘తొలుత వైద్యుల పరిభాషపై ఎక్కువగా దృష్టిపెట్టాను. ఆసుపత్రిలో వారు ఉపయోగించే పదజాలం, రోగులతో సంభాషిస్తున్నప్పుడు వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో కొందరు నిజమైన వైద్యుల్ని కలిసి తెలుసుకున్నా. డాక్టర్‌గా నా పాత్రలో ఎలాంటి నాటకీయత లేకుండా వాస్తవికతను ప్రతిబింబించేలా ఉండాలని దర్శకుడు సూచించారు. అందుకు అనుగుణంగా అనేక విషయాల్ని తెలుసుకున్నా. డాక్టర్ యూనిఫామ్ వేసుకుంటేనే బాధ్యత వచ్చినట్లుగా ఫీలయ్యేదాన్ని. నేను నిజమైన డాక్టర్లా నటిస్తున్నానని యూనిట్ సభ్యులు ప్రశంసించడం ఉత్సాహానిచ్చింది. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని చెప్పింది. వచ్చే ఏడాది జూన్ 17న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.