5000 మీటర్ల రేస్.. 30 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన అవినాశ్
న్యూఢిల్లీ: స్ప్రింటర్ అవినాశ్ సాబ్లే 30 ఏళ్ల క్రితం నాటి జాతీయ రికార్డును బ్రేక్ చేశాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న సాన్ జువాన్ కాపిస్ట్రానో పట్టణంలో జరుగుతున్న అథ్లెటిక్స్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు. 5000 మీటర్ల రన్నింగ్ ఈవెంట్‌ను అతను కేవలం 13:25.65 నిమిషాల్లో పూర్తి చేశాడు. అయితే ఆ టైమింగ్‌లో ఈవెంట్‌ను పూర్తి చేయడం అది సరికొత్త జాతీయ రికార్డుగా మారింది. గతంలో ఈ రికార్డు బహదూర్ ప్రసాద్ పేరిట ఉంది. మహారాష్ట్రకు చెందిన అవినాశ్ అమెరికా ఈవెంట్లో.. 1992లో బహదూర్ ప్రసాద్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. 5వేల మీటర్ల రేస్‌ను బహదూర్ 13:29.70 నిమిషాల్లో పూర్తి చేశాడు.
నిజానికి సాన్ జువాన్ రేస్‌లో అవినాశ్ 12వ స్థానంలో నిలిచినా.. అతను మాత్రం కొత్త జాతీయ రికార్డును నెలకొల్పడం విశేషం. ఇటీవల కోజికోడ్‌లో జరిగిన రేస్‌లోనూ అవినాశ్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లోను అతను 5వేల మీటర్ల రేస్‌ను 13.39.43 నిమిషాల్లో పూర్తి చేశాడు. హాఫ్ మారథాన్‌తో పాటు 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లోనూ అవినాశ్ పేరిట జాతీయ రికార్డులు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

