అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాపట్ల ( Bapatla ) జిల్లా కొల్లూరు మండలం దోనెపూడి సమీపంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లూరు నుంచి వెల్లటూరు వైపు వెళ్తున్న కొబ్బరికాయల ఆటో ప్రమాదవశాత్తు పంట కాల్వలోకి దూసుకెళ్లింది.
ఆటోలో ఉన్న చింతమోటు వాసులు చాటగడ్డ కాంతారావు( 48) , పెసరలంక శ్రీనివాసరావు ( 55) , షేక్ ఇస్మాయిల్(55) మృతి చెందారు. గాయపడ్డ ఇద్దరిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.