న్యూఢిల్లీ: ముస్లిం మహిళలను కించపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉన్న ఓ ఆడియో చాట్ గ్రూప్ వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు క్లబ్‌హౌస్ యాప్ నిర్వాహకులకు ఓ లేఖ రాశారు. ఈ ఆడియో చాట్ గ్రూప్‌ను నిర్వహిస్తున్న వ్యక్తి వివరాలు కావాలని ఆ లేఖలో కోరారు. వాస్తవానికి ఈ ఆడియోను తొలుత ఢిల్లీ మహిళా కమిషన్ గుర్తించి సుమోటోగా స్వీకరించింది. నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలను ప్రారంభించారు. కాగా, ఇటీవల కూడా కొన్ని యాప్‌లలో ముస్లిం మహిళలను కించపర్చిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.