అమరావతి : ఏపీలోని ఏలూరు (Eluru) జిల్లా తల్లి (Mother), కుమారుడి (Son) దారుణ హత్య (Murder ) కలకలం రేపుతుంది. జిల్లాలోని మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రొయ్యూరు భ్రమరాంబ, కుమారుడు సురేష్‌ను కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా చంపివేశారు.
\శనివారం ఉదయం తల్లి, కొడుకు బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా ఇద్దరు హత్యకు గురి కావడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆస్తి తగదాల కారణంగా జంట హత్యలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెళ్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. హత్యకు గురైన సురేష్ ఐటీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.