సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అసుర సంహారం’. కిషోర్ శ్రీకృష్ణ దర్శకుడు. శ్రీసాయి తేజో సెల్యూలాయిడ్స్ పతాకంపై శ్రీమంత్, శబరిష్ బోయెళ్ల నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌తో పాటు పాటల్ని విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాలో తాను విలేజ్ డిటెక్టివ్ పాత్రను పోషించానని, చెడుపై మంచి సాధించే విజయంగా ఈ కథ ఆసక్తికరంగా సాగుతుందని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, వినూత్న కథాంశంతో రూపొందించామని, మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.