e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఆస్ట్రాజెన్‌కాతో బ్ల‌డ్ క్లాట్‌.. స‌మీక్షిస్తున్న కేంద్ర టాస్క్ ఫోర్స్

ఆస్ట్రాజెన్‌కాతో బ్ల‌డ్ క్లాట్‌.. స‌మీక్షిస్తున్న కేంద్ర టాస్క్ ఫోర్స్

ఆస్ట్రాజెన్‌కాతో బ్ల‌డ్ క్లాట్‌.. స‌మీక్షిస్తున్న కేంద్ర టాస్క్ ఫోర్స్

హైద‌రాబాద్: ఆస్ట్రాజెన్‌కా తయారు చేస్తున్న కోవిడ్ టీకాను తీసుకుంటే.. ఆ పేషెంట్ల‌లో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ఆ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. డెన్మార్క్‌, ఐస్‌ల్యాండ్‌, నార్వే, స్వీడెన్‌తో పాటు ఆసియాలోనూ థాయిల్యాండ్ కూడా ఆ టీకా పంపిణీ ఆపేసింది. అయితే ఆస్ట్రాజెన్‌కా కోవిడ్ టీకా వ‌ల్ల ఉత్ప‌న్నం అవుతున్న సైడ్ ఎఫెక్ట్స్‌పై గాఢ‌మైన రీతిలో అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆస్ట్రాజెన్‌కా టీకా వ‌ల్ల క‌లుగుతున్న తీవ్ర ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని, ఆ టీకా వేసుకోవ‌డం వ‌ల్ల సంభ‌విస్తున్న మ‌ర‌ణాలపై ఆరా తీస్తున్న‌ట్లు ఓ ప్ర‌భుత్వ అధికారి వెల్ల‌డించారు. టీకా వ‌ల్ల ఏదైనా దుష్ ప్ర‌భావం ఉన్న‌ట్లు తేలితే ఆ విష‌యాన్ని వెల్ల‌డిస్తామ‌ని కోవిడ్‌19 జాతీయ టాస్క్ ఫోర్స్ స‌భ్యుడు ఎన్‌కే అరోరా తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆస్ట్రాజెన్‌కాతో బ్ల‌డ్ క్లాట్‌.. స‌మీక్షిస్తున్న కేంద్ర టాస్క్ ఫోర్స్

ట్రెండింగ్‌

Advertisement