చింతపల్లి, అక్టోబర్ 03 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ పంచాయతీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న గనిపల్లి మాధవిపై సంఘాలకు సంబంధించిన డబ్బుల విషయంలో కొందరు వ్యక్తులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ వద్ద తనపై ఆరోపణలు చేసిన వారిని మాధవి ప్రశ్నిస్తుండగా, గ్రామానికి చెందిన కుప్పల అమర్నాథ్ అనే వ్యక్తి తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడి దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై క్రైమ్ నంబర్ 172/2026గా కేసు నమోదు చేశారు. అలాగే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 115(2), 352తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం, 2015లోని సెక్షన్లు 3(1)(r), 3(1)(s), 3(2)(va)లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.