అసోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి తెర
అసోంలో ఎన్నికల ప్రచారానికి తెర | అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.

గౌహతి : అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ తరఫున మూడు చోట్ల ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ 6 చోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు.
సాధ్యమైనన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేలా జాగ్రత్త పడ్డారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ప్రచారంలో ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే జరిగిన రెండు విడుతల ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చిందని, చివరి విడుత ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంటుందని అన్నారు.
మహాజోట్ కూటమి నేతలు సైతం అధికారం తామదేనంటూ పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీ) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. ఈ సారి రాష్ట్రంలో అధికారం దక్కించుకోబోచేది టోపీ, లుంగీవాలాలేనని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత దిలీప్ సకియా స్పందించారు. బద్రుద్దీన్‌కు రాష్ట్ర రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు. అస్సాంలో ఏర్పడబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
రెండు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో ఎగువ, మధ్య అసోంలో పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని చెప్పారు. చివరి విడుత ఎన్నికల్లో 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ నెల 6న పోలింగ్ జరుగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్‌లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!
లాక్డౌన్ భయంతో ముంబై వీడుతున్న వలస కార్మికులు
బెంగాల్ స్వీట్ షాప్‌లో.. మమత, మోదీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

