బ్యాంకాక్: ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ద్వయం అర్జున్‌లాల్ జాట్, రవి పసిడి పతకంతో మెరిశారు. శనివారం రాయల్ థాయ్ నేవి రోయింగ్ సెంటర్లో జరిగిన పురుషుల డబుల్ స్కల్స్ రేసును అర్జున్, రవి జోడీ 6:57:88 సెకన్లలో ముగించి టాప్‌లో నిలిచింది. చైనా(7:2:37సె), ఉజ్బెకిస్థాన్(7:07:73సె) రోయర్లు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో పతకం. 2019లో భారత్‌కు కాంస్యం దక్కగా లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్ రజతం ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు తాజా టోర్నీలో పురుషుల సింగిల్ స్కల్స్‌లో పోటీకి దిగిన పర్మిందర్‌సింగ్ 8:07:32సెకన్ల టైమింగ్‌తో రజతం దక్కించుకున్నాడు. పోటీలకు ఆఖరి రోజైన ఆదివారం మరికొన్ని విభాగాల్లో రోయర్లు బరిలోకి దిగుతున్నందున భారత్‌కు పతకాలు దక్కే అవకాశముంది.