15 నుంచి ఆశా కార్యకర్తల సమ్మె
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతోపాటు తమనూ నిలువునా మోసం చేసిందని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించారు.
- మూడేండ్లయినా హామీలు అమలు కాలేదని ఆగ్రహం
- సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డికి వినతి
సూర్యాపేట, నవంబర్ 12 : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతోపాటు తమనూ నిలువునా మోసం చేసిందని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సూర్యాపేట అదనపు కలెక్టర్, డీఎంహెచ్‌వోకు సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరడంతోపాటు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ.. హామీలు ఇచ్చి మూడేండ్లు అయినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటే రేవంత్‌రెడ్డి మాత్రం తమ చావు కోరుతున్నాడని వాపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

