
ఎల్బీనగర్, డిసెంబర్ 20: రైతన్నలను మోసగించే ఏ ప్రభుత్వం నిలబడదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుష వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తా, తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణతో పాటు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాము రైతుల వడ్లు కొనబోమని చెబుతుంటే తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం రైతులను వరిపంట సాగు చేయాలని, కేంద్రంతో కొనిపిస్తామని అబద్దాలు చెబుతున్నామని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకుని రైతుల పక్షాన నిలబడాలని, తెలంగాణ రైతులకు అన్యాయం జరుగకుండా చూడాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతు బీమా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ.. రైతన్నకు అన్యాయం చేస్తున్న కేంద్రంపై పోరాటం తప్పదన్నారు. సీఎం కేసీఆర్ రైతన్నల సంక్షేమానికి పాటుపడుతుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం రైతన్న వెన్ను విరుస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, కొప్పుల విఠల్‌రెడ్డి, భవానీప్రవీణ్కుమార్, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, వజీర్ ప్రకాశ్‌గౌడ్, సామ తిరుమల్‌రెడ్డి, రమావత్ పద్మానాయక్, చెరుకు ప్రశాంత్‌గౌడ్, డివిజన్ల అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, లింగాల రాహుల్ గౌడ్, జక్కల శ్రీశైలం యాదవ్, వర ప్రసాద్ రెడ్డి, రాజిరెడ్డి, చింతల రవికుమార్, కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, నాయకులు చేగోని సుదర్శన్ గౌడ్, పీచర వెంకటేశ్వర్రావు, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, తులసీ శ్రీనివాస్, నల్ల రఘుమారెడ్డి, మల్లెపాక యాదగిరి, దూగుంట్ల నరేశ్, శరత్ చంద్ర, వరుణ్ చంద్ర, డేరంగుల కృష్ణ, మహిళా నాయకురాళ్లు శైలజ, విజయలక్ష్మి, రాణిరావు, విజయమ్మ, దేవిరెడ్డి శ్వేతా రెడ్డి, రాణిరావుతో పాటుగా పలువురు పాల్గొన్నారు.