IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు టీ20 మజాను ఇచ్చింది. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ సంచలన బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌ను 13 పరుగుల తేడాతో ఓడించింది. 215 టార్గెట్ ఛేదనలో రోహిత్ సేనను 201 రన్స్‌కే కట్టడి చేసింది. కామెరూన్ గ్రీన్(67), సూర్యకుమార్ యాదవ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. దాంతో, ముంబై జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
అర్ష్‌దీప్ సింగ్ 20వ ఓవర్లో హడలెత్తించాడు. మూడో బంతికి తిలక్ వర్మ(3)ను బౌల్డ్ చేశాడు. మిడిల్ స్టంప్ విరిగి అవతల పడింది. తర్వాత బంతికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన నీహల్ వధేరా(0) కూడా అచ్చం అలానే బౌల్డ్ అయ్యాడు. టిమ్ డేవిడ్(9) క్రీజులో ఉన్నాడు.
🙌 https://t.co/81seKC2hCb pic.twitter.com/G5W5oUuhaD
— IndianPremierLeague (@IPL) April 22, 2023
భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(1) ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(44), కామెరూన్ గ్రీన్(67) దూకుడుగా ఆడారు. అయితే.. లివింగ్‌స్టోన్ రోహిత్‌ను ఔట్ చేయడం వీళ్ల 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సూర్యకుమార్ యాదవ్(57), గ్రీన్ ధనాధన్ ఆడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(3) విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్, లివింగ్‌స్టోన్ ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మూడో ఓవర్లో షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న మాథ్యూ షార్ట్(11) ఔటయ్యాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (26), అథర్వ తైడే ఇన్నింగ్స్ నిర్మించారు. దాంతో, పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. అయితే.. అర్జున్ టెండూల్కర్ ఎల్బీగా ఔట్ చేసి45 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. పీయూష్ చావ్లా వేసిన 10వ ఓవర్లో లివింగ్‌స్టోన్(10) స్టంపౌట్, అథర్వ తైడే(29) బౌల్డ్ అయ్యారు. అయితే.. ఐదో వికెట్‌కు సామ్ కరన్(55), హర్‌ప్రీత్ సింగ్ భాటియా(41) కీలకమైన 92 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన జితేశ్ శర్మ (25) దంచాడు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీశారు. అర్జున్ టెండూల్కర్, బెహ్రాన్‌డార్ఫ్, జోఫ్రా ఆర్చర్‌కు ఒక్కో వికెట్ దక్కింది.