Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
ARRahman | నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana). ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతమ్మగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana). ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతమ్మగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలోని పాటలపై వస్తున్న విమర్శల పట్ల తాజాగా రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. మొదట్లో ఈ సినిమాలోని పాటలను తప్పుబట్టిన వారే, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుని క్షమాపణలు చెబుతున్నారని రెహమాన్ పేర్కొన్నారు. ట్రోల్స్ మరియు విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, కేవలం తన పనిని వంద శాతం నిజాయతీగా చేయడంపైనే పూర్తి దృష్టి పెడతానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సినిమాకు సంగీతం అందించే క్రమంలో పడే శ్రమను ఆయన పంచుకున్నారు. ట్యూన్స్‌లో పదేపదే మార్పులు చేస్తూ ఎంతో కష్టపడతామని, అన్నీ పూర్తయ్యేసరికి బయట వచ్చే కామెంట్లను పట్టించుకునే శక్తి కూడా ఉండదని చెప్పారు. ఒక పాటను ఎన్నోసార్లు కూలంకషంగా పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాతే తుది రూపం ఇస్తామని తెలిపారు. తన కుమారుడు చెప్పిన మాటను గుర్తుచేసుకుంటూ.. నిన్న విమర్శించిన వాళ్లే.. ఈ రోజు క్షమాపణలు చెబుతారని నా కొడుకు నాతో అంటుంటాడు. నేను మాత్రం నా పనిని నిజాయతీగా చేశాను, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ భారీ బడ్జెట్ ‘రామాయణ’ తొలి భాగం నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
Nutrition | పోషకాహారం అధికంగా తీసుకోవడం లేదా వ్యాయామ తీవ్రత.. గుండె జబ్బులకు ఏది కారణం..?
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

