Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Chandrayaan | 'నీదీ నాదీ ఒకే కథ', 'విరాటపర్వం' వంటి విభిన్న చిత్రాల ద్వారా దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు 'రాజు వెడ్స్ రాంబాయి' వంటి సంచలన విజయవంతమైన చిత్రాన్ని అందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న తాజా చిత్రం 'చంద్రయాన్' (Chandrayaan).
Chandrayaan | ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ వంటి విభిన్న చిత్రాల ద్వారా దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సంచలన విజయవంతమైన చిత్రాన్ని అందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘చంద్రయాన్’ (Chandrayaan).
టాలీవుడ్లో సరికొత్త కామెడీ అడ్వెంచర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రాకెట్ రివీల్ (లాంచ్) వేడుక అక్టోబర్ 26, 2026న హైదరాబాద్‌లోని మాదాపూర్ రెట్రో డ్రైవ్-ఇన్ (Retro Drive-in) వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక వేడుకకు టాలీవుడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శ్రీనాథ్ చంద్రశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన రాకెట్ లాంచ్ ఈవెంట్ సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక సరికొత్త భావోద్వేగాలు, నవ్వులు పంచే వినోదాత్మక అడ్వెంచర్‌గా వస్తున్న ఈ ‘చంద్రయాన్’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. వేణు ఊడుగుల సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

