e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News లాల్‌బజార్‌

లాల్‌బజార్‌

  • టైలరింగ్‌లో కాకలుతీరిన యోధులు
  • దర్జీ వృత్తిలో స్థిరపడిన మహారాష్ట్రీయులు

కాలనీలో ఒక టైలర్‌ దుకాణం ఉంటే షరామామూలే.. కానీ టైలర్‌ దుకాణాలతోనే కాలనీ ఏర్పడితే.. అది ఆశ్చర్యమే. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 25 నుంచి 30 టైలర్‌ దుకాణాలు ఉంటాయి. ఎక్కడనుకుంటున్నారా.. చలో లాల్‌బజార్‌. మహంకాళి అమ్మవారి ఆర్చ్‌ (కమాన్‌) నుంచి బాలాజీనగర్‌ రోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహం వరకు దాదాపు 25 నుంచి 30 టైలర్‌ దుకాణాలుంటాయి. అలాగని వీరంతా దర్జీలు అనుకుంటే పొరపాటే. ఇక్కడ మహరాష్ట్రీయన్లే టైలరిస్టులు. వీరంతా టైలరింగ్‌ వృత్తిలో కాకలు తీరిన యోధులు. ఒక్కొక్కరికి కనీసం 30 నుంచి 40 ఏండ్ల అనుభవం ఉంది. మిలటరీ, స్పోర్ట్స్‌, సూట్స్‌, సఫారీ, కర్చీఫ్‌లు మొదలుకొని నిక్కర్ల వరకు ఇక్కడ అన్నీ కుడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మిలటరీ దుస్తులకు కేరాఫ్‌ అడ్రస్‌ లాల్‌బజార్‌.

లాల్‌బజార్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారివే 15 దుకాణాల వరకు ఉంటాయి. వారంతా వ్యాపార నిమిత్తం టైలరింగ్‌ వృత్తిలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సుమారు 200 వరకు వారి గృహసముదాయాలు ఉంటాయి. వారి సంక్షేమం కోసం ఇక్కడ ప్రత్యేకంగా బహుసార్‌ సమాజ్‌ పేరుతో మరాఠీ అసోసియేషన్‌ ఉంది. జవాన్‌ నుంచి మొదలుకొని ఆఫీసర్‌ స్థాయి వరకు అన్ని రకాల స్టార్స్‌, వివిధ ర్యాంకు స్థాయిలో ఉన్న అధికారులకు కావాల్సిన కోడింగ్స్‌, కమాండో హోదా వరకు అన్ని రకాల డ్రెస్‌ కోడింగ్‌కు సంబంధించిన పరికరాలతో డ్రెస్‌లు కుట్టిస్తారు. అంతేగాకుండా లాల్‌బజార్‌ పరిధిలోనే ఆర్మీ ఆర్డినెన్స్‌ కాప్స్‌ కేంద్రం (ఏవోసీ), మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంసీఈఎంఈ), సిగ్నలింగ్‌ వ్యవస్థ, ఆర్టీలరీ, డిఫెన్స్‌ సర్వీస్‌ కాప్స్‌ (డీఎస్సీ), కాలేజీ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ (సీడీఎం) లాంటి ఆర్మీ సంస్థలు ఇక్కడే ఉన్నాయి. ఇక వేరే ఆర్మీ ప్రాంతాల్లో ఇన్ని సంస్థలు ఉండవు. అందుకే ఇక్కడికి అనేక రకాలైన మిలిటరీ వస్తువులతో పాటు దుస్తులు దిగుమతి చేసుకొని సేవలందిస్తున్నారు.

- Advertisement -

ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు..
నగరంలో మిలటరీ దుస్తులతో పాటు జవాన్లకు సంబంధించిన వస్తువులకు కేరాఫ్‌ అడ్రస్‌గా లాల్‌బజార్‌ నిలుస్తుంది. లంగర్‌హౌస్‌ నుంచి మొదలుకొని సంగారెడ్డి, జహీరాబాద్‌, గ్రేటర్‌ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం ఇక్కడికి ఆర్డర్లు వస్తుంటాయని టైలర్లు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కొలతలు తీసుకొని తమకు తెలియజేస్తారని చెబుతున్నారు.

మా ముత్తాతలు ఇక్కడ స్థిరపడ్డారు
తాతల తండ్రుల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేమూ అంతే నిబద్ధతతో పనిచేస్తున్నాం. మా ముత్తాతలే లాల్‌బజార్‌కు వచ్చి స్థిరపడ్డారు. వారి ఆదర్శంతోనే వృత్తిలో కొనసాగుతున్నాం. బయటి టైలర్లతో పోలిస్తే ఇక్కడ రేట్లు కూడా తక్కువే. 750కే డ్రెస్‌ కుట్టిస్తాం. బయట మాత్రం 850 నుంచి ఆపైనే ధరలు ఉంటాయి. ఎప్పుడు డ్రెస్‌ కావాలంటే అప్పుడే కుట్టిచ్చేందుకు సిద్ధంగా ఉంటాం.

  • చంద్రప్రకాశ్‌, టైలరిస్టు

నమ్మకంగా పని చేస్తాం
ఎన్నో ఏండ్లుగా టైలర్‌ వృత్తిలో సమాజ్‌ సభ్యులు కొనసాగుతున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులెదురైనా బహుసార్‌ సమాజ్‌ తరఫున ఆదుకొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వినియోగదారులకు సేవలందించాలనే లక్ష్యంతో పనిచేయాలని తీర్మానించాం. నమ్మకాన్ని వమ్ముచేయకుండా సంఘం సభ్యులందరూ వారి సేవలను కొనసాగిస్తున్నారు.

  • ఓం కుమార్‌, బహుసార్‌ సమాజ్‌ అధ్యక్షుడు

టైలరింగే జీవితం
మాకు టైలరింగే జీవితంగా మారింది. వృత్తిలో అంతర్లీనమైపోయాం. తాతలు, తండ్రుల తర్వాత.. చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. ఈ వృత్తిలో కొనసాగుతున్నందుకు సంతృప్తిగా ఉంది. ఇప్పుడు నా వయస్సు 70 ఏండ్లు.. ఇంకా టైలర్‌ దుకాణానికి వచ్చి పనులు చూసుకుంటాను. ప్రస్తుతం నా కుమారుడు వికాస్‌ పనులన్నీ చూసుకుంటున్నాడు.

  • వేదప్రకాశ్‌, టైలర్‌ ఓనర్‌

నాణ్యతతో కుట్టిస్తాం..
ఆర్మీ సిబ్బందికి ఇక్కడ ప్రత్యేకం. సాధారణ ప్రజలు కూడా ఇక్కడికే వస్తుంటారు. మంచి నాణ్యతతో డ్రెస్‌ కుట్టిస్తాం. బట్టలు కుట్టించుకోవాలా లాల్‌బజార్‌ వెళ్లండి అని చెబుతుంటారు. అందుకనుగుణంగా కచ్చితత్వంతో డ్రెస్సులు కుట్టి స్తాం. అర్జెంట్‌ అంటే అప్పటికప్పుడే ఒక్క రోజులో ఇవ్వగలుగుతం. అందుకే ఇక్కడి టైలర్లపై వినియోగదారులు మక్కువ చూపుతారు.

  • కిరణ్‌, క్లాత్‌ కట్టింగ్‌ మాస్టర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement