హిందీ భాషను తమిళులు ఎంతగా ద్వేషిస్తారో తెలుసు కదా. తమిళనాడు వెళ్లి హిందీలో మాట్లాడితే ఇక అంతే సంగతులు. అక్కడే పుట్టి పెరిగిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తన మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హిందీలో మాట్లాడిన యాంకర్‌ను అతడు సరదాగా ట్రోల్ చేశాడు. రెహమాన్ తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా 99 సాంగ్స్. ఈ మూవీ ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఇందులో హీరోగా ఎహసాన్ భట్ నటిస్తున్నాడు. అతనికి వెల్కమ్ చెప్పడానికి యాంకర్లో హిందీ మాట్లాడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న రెహమాన్.. హిందీలో మాట్లాడుతున్నావా అంటూ స్టేజ్ మీది నుంచి నవ్వుతూ కిందికి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ తాను సరదాగానే అలా అన్నానని అనడంతో ఆ యాంకర్ కూడా లైట్ తీసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.