Naveen Reddy | యువతకు కేటీఆర్ నాయకత్వం ఆదర్శం : నవీన్ రెడ్డి
Naveen Reddy | యువతకు కేటీఆర్ నాయకత్వం ఆదర్శమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే యువజన విభాగం అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి తెలిపారు.
లండన్ : యువతకు కేటీఆర్ ( KTR ) నాయకత్వం ఆదర్శమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ( BRS NRI UK ) యూకే యువజన విభాగం ( Youth Wing ) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి ( Naveen Reddy ) తెలిపారు. ఈ సంద్భరంగా ఆయన మాట్లాడుతూ యూకే యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ప్రకటించినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారత దేశంలో యువతకు ఆదర్శంగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలతో అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే విద్యార్థులకు, యువతకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ యువత తలుచుకుంటే రాజ్యాలే పడిపోయాయని అన్నారు. నూతన ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం క్రమశిక్షణతో పని చేసి పార్టీకి, నాయకుడికి మంచి పేరు తీసుకొని రావడమే కాకూండా తెలంగాణ ఎన్నారైలకు కూడా సేవ చేయాలని సూచించారు.
ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం జాతీయ కన్వీనర్‌గా ప్రశాంత్ మామిడాల
, కార్యదర్శులుగా పవన్ కళ్యాణ్ , తరుణ్ లూనావత్ , సంయుక్త కార్యదర్శులుగా హరికృష్ణ మామిళ్ళ , అబ్దుల్ ఖుద్దూస్ ,కో-ఆర్డినేటర్‌గా అమరేశ్వరి బోయిని, మీడియా కో-ఆర్డినేటర్‌గా సాయి కిరణ్ రావు పేరాల,లెస్టర్ (పట్టణం) ఇన్చార్జిగా సాకేత్ కాచవరపు,ఈవెంట్స్ ఇన్చార్జిగా నర్సింగ రావు, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా జనార్దన్ దమ్మక్కపల్లిని నియమించినట్లు నవీన్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

