నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ గణితశాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్...
– యూజీ గణితశాస్త్ర విభాగంలో ఖాళీ పోస్టు భర్తీకి చర్యలు
– ఈ 10లోగా దరఖాస్తుల సమర్పణ
రామగిరి, నవంబర్ 07 : నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ గణితశాస్త్ర విభాగంలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పీజీలో 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని తెలిపారు. పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలతో పాటు బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు వెల్లడించారు.
10వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా నాగార్జున ప్రభుత్వ కళాశాల కార్యాలయంలో సమర్పించాలని ప్రిన్సిపాల్ సూచించారు. దరఖాస్తుతో పాటు ఎస్సీసీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్, సెట్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డు, బోధనా అనుభవ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులను జత చేయాలని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

