‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంత ప్రజలకు వారి స్థిరాస్తి పేర్లు మార్పిడికి అవకాశం కల్పించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ...
రుద్రంపూర్, నవంబర్ 07 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంత ప్రజలకు వారి స్థిరాస్తి పేర్లు మార్పిడికి అవకాశం కల్పించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ.. రాముడు ఇచ్చిన వరం మా రామవరం అనుకుంటామే కానీ రామవరం ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా రామవరపు ప్రాంత ప్రజల దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రామవరం ప్రజల ఓట్లు కావాలి, రామవరం ప్రజల పన్నులు కావాలి, కానీ రామవరం ప్రజలకు నివాస హక్కు ఉండొద్దా! అని సమావేశంలో ప్రశ్నించారు. కౌన్సిల్లో సభ్యులందరూ రామవరం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సహకరించాలని ఆమె సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
తాతల, తండ్రుల నాటి పేర్లతోనే పన్నులు కడుతున్న వారి మరణాంతరం వారసుల పేర్లు మార్చడం లేదు. అధికారులు దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే సమావేశంలోనైనా ఎజెండాలో పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని మేయర్ కి వినతిపత్రం అందజేసి కౌన్సిల్ కి విజ్ఞప్తి చేశారు. అలాగే కోతుల సమస్య పరిష్కారానికి ఇంకా అన్ని డివిజన్లో బోన్లను ఏర్పాటు చేయాలని, అలాగే కుక్కలు, పందుల సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పైపుల లీకేజీలు, గుంటలు పూడ్చడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే దాని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారానికి మేయర్ మూడ్ గణేష్, అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సిపిఐ కార్పొరేటర్స్, కార్పొరేషన్, రెవెన్యూ, మెప్మా, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

