‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా.టి. భరత్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో...
– కేవీకే శాస్త్రవేత్త డా.టి.భరత్
రుద్రంపూర్, నవంబర్ 07 : సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా.టి. భరత్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై నిర్వహించిన ఐదు రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఐదవ రోజు ముగింపు కార్యక్రమాన్ని కేవీకే ప్రాంగణంలోని సహజ రైతుల క్షేత్రాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డా.భరత్ మాట్లాడుతూ నేల సారాన్ని కాపాడుకోవడం, స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం రైతులకు ఎంతో అవసరమన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం (ఐఎఫ్ఎస్) వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శోభన్ బాబు సహజ వ్యవసాయ పద్ధతులపై తన అనుభవాలను, పరిజ్ఞానాన్ని శిక్షణార్థులతో పంచుకున్నారు. ఈ శిక్షణలో జిల్లాకు చెందిన 20 మంది కృషి సఖీలు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు నేల ఆరోగ్య పరిరక్షణ, సహజ వ్యవసాయ విధానాలు, వివిధ సహజ కషాయాలు, ద్రావణాల తయారీపై వారికి ఆచరణాత్మక శిక్షణ అందించారు. ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న కృషి సఖీలకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

