హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంబ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పరీక్ష ముగిసిందని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 118 పోస్టులకు 3,132 మంది దరఖాస్తు చేసుకోగా, 2,925 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
హైదరాబాద్‌లో 4 సెంటర్లలో నిర్వహించిన పరీక్షకు మొదటి పేపర్‌కు 2,306 మంది, రెండో పేపర్‌కు 2,270 మంది హాజరైనట్టు చెప్పారు. మొదటి పేపర్ ప్రాథమిక ‘కీ’ వివరాలు తమ అధికారిక వెబ్సైట్లో తర్వలోనే పొందుపరుస్తామని పేర్కొన్నారు.