అమరావతి : అమెరికాలో గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి చెందాడు. పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రవితేజ (34) 2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాడు. ఒహాయో రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో నివాసం ఉంటూ ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశానికి తల్లిదండ్రులను పిలిపించుకున్నాడు.
కాగా, ఈనెల 18న రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తుండగా రవితేజకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సర్జరీ చేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో రవితేజ చనిపోయినట్లు తెలిసింది.