AP Inter Results | ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ (AP Inter Results) ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీన పూర్తయ్యాయి. పరీక్షలు ముగిసిన వెంటనే బోర్డు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఫలితాలను త్వరగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకనం ప్రారంభమై, నాలుగు దశల్లో పూర్తయింది. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా సమర్థవంతంగా పూర్తవడంతో ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.