AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
AP Muncipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
AP Muncipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజైన అక్టోబర్ 28న స్థానిక సెలవు ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారం కల్పించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా స్థానిక సెలవు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం–1881 కింద కూడా పోలింగ్ రోజున స్థానిక సెలవు ప్రకటించేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–1988 ప్రకారం పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించేందుకు కార్మిక శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం అధికారం కల్పించింది.
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాలకు స్థానిక సెలవు ప్రకటించేందుకు కూడా జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. సంబంధిత జిల్లా కలెక్టర్లు, పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు, కార్మిక శాఖ అధికారులు ఈ ఉత్తర్వుల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Ap Muncipal Elections Holid
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

