Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Shakambari Devi | చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి . 8వ రోజు రుద్రేశ్వరీదేవిని దుర్గాదేవిగా అలంకరించారు.
హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో (Thousand Pillar Temple ) శ్రీ రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి . 8వ రోజు రుద్రేశ్వరీదేవిని దుర్గాదేవిగా అలంకరించారు. కోన శ్రీకర్ దంపతులు అందించిన వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవి ( Shakambari Devi ) గా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. యాగశాలలో శ్రీలక్ష్మీ దుర్గ సరస్వతియుక్త 18 అధ్యాయాలతో మహా చండీయాగం నిర్వహించారు.
అనంతరం సద్దుల బతుకమ్మ పల్లకిలో ప్రతిష్టించిన రుద్రేశ్వరిదేవిని అశ్వవాహనంపై పల్లకిసేవ నిర్వహించారు. నిత్యాన్నదానంలో భాగంగా మహా ప్రసాద వితరణ, వేలాదిమంది భక్తులు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
అన్నదాన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పులి రజినీకాంత్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు చొల్లేటి కృష్ణమాచారి, గంగపుత్ర సంఘం నాయకుడు గరిగ అశోక్, ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు పల్లం రమేష్, మాడిశెట్టి వరుణ్ పాల్గొని సేవలందించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ, భరత్శర్మ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో డి.అనిల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

