‘నాలుగేండ్లుగా నా సిల్లీ జోక్స్, నా బద్ధకాన్ని భరించావు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నన్ను మంచివైపు నిలబడేలా స్ఫూర్తిని నింపావు. నా ప్రతి దారిని సంపూర్ణం చేశావు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తుంటా. నాలుగేండ్లలో ఈ రోజు మరింత ప్రత్యేకం.. కుటుంబంగా మనకు ఇది తొలి వార్షికోత్సవం. వామికా (మంచ్కిన్)తో జీవితం సంపూర్ణమైంది’ అని విరాట్ కోహ్లీ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. బాలీవుడ్ నటి అనుష్కా శర్మను డిసెంబర్ 11, 2017న విరాట్ వివాహమాడాడు.