హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు మరోకేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీస్స్టేషన్లో పగడాల వెంకటేశ్ ఈ నెల 20న పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కాగా, ఏపీ మాజీ సీఎం, జగన్ పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించి. న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.