బాలీవుడ్ (Bollywood), టాలీవుడ్, కోలీవుడ్ దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde). ఈ బ్యూటీని సినిమాలోకి తీసుకుంటే మినిమమ్ హిట్ గ్యారంటీ అని ఫిక్సయిపోయారు మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే మరో క్రేజీ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతుందన్న న్యూస్ ఇపుడు టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ భామ నాగచైతన్య (Naga Chaitanya)తో కలిసి బై లింగ్యువల్ ప్రాజెక్టు (bilingual venture) చేయబోతుందట.
చైతూ, పూజ కాంబోలో ఇప్పటికే ఒక లైలా కోసం (Bollywood)మూవీ వచ్చింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తీయనున్న ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం పూజా హెగ్డే అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. వెంకట్ ప్రభు తెలుగులో డైరెక్ట్ చేస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. అన్నీ కుదిరితే చైతూ-పూజ సిల్వర్ స్క్రీన్ పై మరోసారి సందడి చేయడం ఖాయమైపోయినట్టే. నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు లాల్ సింగ్ చధా సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ కూడా చైతూ ఖాతాలో ఉంది. పూజా హెగ్డే నటించిన ఆచార్య, బీస్ట్ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మరోవైపు మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో మూడోసారి వస్తున్న సినిమాలో కూడా పూజాహెగ్డేనే హీరోయిన్గా ఫైనల్ చేశారు.