ప్రయాణికులకు మరో 24 స్పెషల్ రైళ్లు…

అమరావతి,జూన్ 24: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఈ రైళ్లు కొనసాగుతాయని తెలిపింది. వీటిలో 6 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించనుండగా మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు రైళ్లు వారంలో రెండు సార్లు నడవనున్నాయి. ఈ రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడ్ సర్వీసులుగానే నడవనున్నాయి. వీటిలో ప్రయాణించాలంటే ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
Train No 08480: తిరుపతి-భువనేశ్వర్ మధ్య ప్రతీ ఆదివారం నడిచే ఈ స్పెషల్ ట్రైన్ జులై 04 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02851: విశాఖపట్నం-హెచ్.నిజాముద్దీన్ మధ్య వారానికి రెండు సార్లు(సోమవారం, శుక్రవారం) నడిచే ఈ ట్రైన్ జులై 2 నుంచి అందుబాటులోకి రానుంది.

Train No 02852: హెచ్.నిజాముద్దీన్-విశాఖపట్నం మధ్య వారానికి రెండు సార్లు(బుధవారం, ఆదివారం) నడిచే ట్రైన్ జులై 4 నుంచి నడపనున్నారు.
Train No 02869: విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ మధ్య వారానికి ఒక సారి(సోమ) నడిచే ట్రైన్ జులై 5 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02870: చెన్నై సెంట్రల్-విశాఖపట్నం మధ్య వారానికి ఒక సారి(మంగళవారం) నడిచే ట్రైన్ ఈ జులై 6 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02831: విశాఖపట్నం నుంచి లింగంపల్లి ట్రైన్(డైలీ) జులై 01 నుంచి అందుబాటులోకి రానున్నది.
Train No 2832: లింగంపల్లి-విశాఖపట్నం ట్రైన్(డైలీ) జులై 02 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 07488: విశాఖ-కడప మధ్య నడిచే ట్రైన్(డైలీ) జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 07487: కడప-విశాఖ మధ్య నడిచే ఈ ట్రైన్ జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 08479: భువనేశ్వర్ నుంచి తిరుపతి మధ్య ప్రతీ శనివారం నడిచే ఈ వీక్లీ ట్రైన్ జులై 3 నుంచి అందుబాటులోకి రానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

