Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Anirudh-Kavya | సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన రెండు ప్రముఖ కుటుంబాలు ఒక్కటి కాబోతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని, వ్యాపారవేత్త కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Anirudh-Kavya | సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన రెండు ప్రముఖ కుటుంబాలు ఒక్కటి కాబోతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని, వ్యాపారవేత్త కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరి వివాహ వేడుకలను గ్రీస్‌లో నవంబర్ 10, 11 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ప్రతిష్టాత్మక ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
వివాహ వేడుకలకు సమయం దగ్గరపడటంతో అనిరుధ్ నివాసంలో ఇప్పటికే ముందస్తు సంబరాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనిరుధ్ డప్పుపై కూర్చొని సరదాగా సందడి చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ వివాహం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఖరీదైన రాయల్ ఆహ్వాన పత్రిక వీడియో కూడా నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గ్రీస్‌లో జరిగే వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చెన్నైలో నిర్వహించే రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టాలీవుడ్‌కు చెందిన అల్లు అర్జున్ వంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందే అవకాశముందని చర్చ జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ కుటుంబానికి సినీ రంగంతో ఎంతోకాలంగా అనుబంధం ఉంది. ఆయన తండ్రి రవి రాఘవేంద్ర నటుడిగా గుర్తింపు పొందగా, తల్లి లక్ష్మి శాస్త్రీయ నృత్య కళాకారిణి. లక్ష్మి, సూపర్‌స్టార్ రజనీకాంత్ భార్య లతకు సోదరి కావడంతో అనిరుధ్‌కు రజనీకాంత్ మేనమామ వరుస అవుతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

