Anil Ravipudi | టాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పీక్‌లో కొనసాగుతున్నారు. ‘పటాస్’ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు వరుస హిట్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్న ఆయన, తాజాగా చిరంజీవితో కలిసి రూపొందించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్‌గా మారాయి. తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ కి డైరెక్షన్ చేసే అవకాశం ఆయనకే వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మిస్ అయ్యిందని అనిల్ వివరించారు:
విజయ్ గారు స్వయంగా నన్ను సంప్రదించి తన లాస్ట్ సినిమాను డైరెక్ట్ చేయాలని కోరారు. ఇది నాకు చాలా గౌరవంగా అనిపించింది. కానీ, ఆ కథను రిమేక్ చేయాలనే ఆలోచనలో ఉండగా, చివరి ఫిల్మ్ కావడం, అభిమానుల భావాలు ఎలా ఉంటాయో అనే భయం వల్ల స్ట్రైట్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే కథపై విజయ్‌కు ఉన్న బలమైన నమ్మకం కారణంగా ఆయన ఆ సినిమాను రిమేక్ చేయాలని పట్టుబట్టారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందన్న నమ్మకం నాకు ఉంది అంటూ అనీల్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు విజయ్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి
ఇక కోలీవుడ్‌లో ‘జన నాయగన్’ విడుదలపై సెన్సార్ సమస్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. రాజకీయ నేపథ్య అంశాల కారణంగా సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలకు ఇబ్బందులు కలిగించింది. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్, డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఈ ఘటన విజయ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది. జన నాయగన్ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ విజయ్ కెరీర్ ముగింపు చిత్రం కావడంతో ప్రేక్షకులు, ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.