అమరావతి : ఆంధ్రాలో కలిపిన విలీన గ్రామాలు ఆందోళన నిర్వహించాయి. పిచ్చుకలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తం పట్నం, గుండాల గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గ్రామాలను భద్రాద్రిగూడెంలో కలపాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల తమ గ్రామాలు నీట మునిగి తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని, తమను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
‘ ఆంధ్ర వద్దు- తెలంగాణ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. తమను ఏపీలో కలపడం వల్ల గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు భధ్రాద్రికి సమీప ప్రాంత జిల్లా అని పేర్కొన్నారు. తమ గ్రామాలు ప్రస్తుతం అల్లూరి జిల్లాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అంతదూరం వెళ్లాలంటే తమ కష్టాలు అన్ని ఇన్నీ కావని అన్నారు.