Death : అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం బాపట్ల జిల్లా (Bapatla district) కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. టెక్సాస్ (Texas) లోని ఓ యూనివర్సిటీలో ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న యార్లగడ్డ రాజ్యలక్ష్మి (Yarlagadda Rajyalaxmi) నవంబర్ 7న నిద్రలోనే ప్రాణాలు విడిచింది. ఆమె గత రెండు మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్నదని రాజ్యలక్ష్మి స్నేహితురాళ్లు తెలిపారు. ఈ క్రమంలోనే నవంబర్ 6న రాత్రి నిద్రపోయిన రాజ్యలక్ష్మి 7న ఉదయం అలారం మోగుతున్నా లేవలేదని, తాము వెళ్లి చూసేసరికి చనిపోయి ఉందని చెప్పారు.
రెండు మూడు రోజులుగా రాజ్యలక్ష్మి తీవ్రమైన దగ్గు, ఛాతినొప్పితో బాధపడుతున్నదని ఆమె స్నేహితురాళ్లు చెప్పారని అమెరికాలోనే ఉంటున్న ఆమె కజిన్ బ్రదర్ చైతన్య తెలిపారు. నవంబర్ 6న నిద్రపోయి మరుసటి రోజు లేవలేదని చెప్పారని, తాము వెళ్లి చూసేరికి ఆమె చనిపోయి ఉందని తెలిపారని అన్నారు. రాజ్యలక్ష్మి పేరెంట్స్ అమెరికాకు వెళ్లడం కోసం, ఆమె తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ తిరిగి చెల్లించడం కోసం, ఆ తర్వాత ఆమె పేరెంట్స్ బతుకుదెరువు కోసం తాను ఫండ్ రైజ్ చేస్తున్నానని చైతన్య తెలిపారు.