Breaking News | వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.