మహీంద్రా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ బిజినెస్మెన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో యాక్టివ్గా ఉంటారు. రోజుకొక మోటివేషనల్ వీడియోను షేర్ చేస్తుంటారు. తాజాగా, ఓ తాబేలు మరో తాబేలుకు సహాయపడే వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోలో ఒక తాబేలు బోర్లాపడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. దగ్గరలో ఉన్న మరో తాబేలు చూసి మెల్లగా దగ్గరికి వచ్చి బోర్లాపడిన తాబేలును యధాస్థానానికి తీసుకొస్తుంది. ఈ వీడియోను షేర్చేస్తూ ఇందులో మంచి మెసేజ్ ఉందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఫ్రెండ్ ఉండడమంటే నిజంగా అది మనం చేసుకున్న అదృష్టమేనని పేర్కొన్నారు. ఈ తాబేళ్ల ఒరిజినల్ వీడియోను ‘అమేజింగ్ నేచర్’ యూజర్ పోస్ట్ చేయగా, 804కే వ్యూస్ వచ్చాయి.
The phrase ‘Turning turtle’ means to be flipped upside down. But after seeing this I think it should mean helping a friend in need. One of the greatest gifts in life is to have a buddy who helps you get back on your feet and Rise. pic.twitter.com/7VpINFzJdm
— anand mahindra (@anandmahindra) April 8, 2022